ఆదిలాబాద్ జిల్లా ఎం పి జి నగేష్ జన్మదిన వేడుకలు బజార్ హత్నూర్ మండలం లోని తిరుమల గార్డెన్ లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా వివిధ మండలాల్లోని బిజెపి నాయకులు, కార్యకర్తలు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, సన్మానం చేస్తూ మాట్లాడారు. 30 సంవత్సరాలనుండి రాజకీయంలో ఉంటూ .. మచ్చ లేని నాయకుడుగా పేరు తెచ్చుకొన్నారని కొని
యాడారు.
అనంతరం ఎంపీ జి నగేష్ మాట్లాడుతూ కార్యకర్తల ఆశీస్సులే తమకు శ్రీ రామ రక్ష అని ,, కార్యకర్తల ఆశీస్సులు ఉండబట్టే ఇంతవాన్ని అయ్యానని అన్నారు. అందుకే కార్యకర్తలకు రుణపడి ఉంటానని, అందరికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని చెప్పారు. ఏమి ఆశించకుండా తన పట్ల ప్రేమ చూపిస్తున్నందుకు జన్మ ధన్యం అయింది అని తెలిపారు.
ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందం, సీనియర్ నాయకులు జీవీ రమణ, ముస్తాపురే అశోక్,ఇచ్చోడ బిజెపి నాయకులు కేంద్రే నారాయణ, ఆంటే మండల బిజెపి అధ్యక్షులు పోరెడ్డి శ్రీనివాస్, మహిళ బిజెపి నాయకురాలు సుమన్ బాయి, బజార్ హత్నూర్ నాయకులు గణేష్, సుఖదేవ్ మోహన్, నానం రమణ, సుధాకర్, సుభాష్ పటేల్ సూర్య, బోరే రవి,పలు మండలం లనుంచి వచ్చిన బిజెపి నాయకులు కార్యకర్తలు
తదితరులు హాజరు అయ్యారు. బోథ్ కి చెందిన పదవీ విరమణపొందిన ఉపాద్యాయుడు సురేష్ వైద్య
జి నగేష్ సమక్షంలో బిజెపి కండువా కప్పుకొని పార్టీ
సభ్యులుగా చేరారు.