శ్రీనగర్ : శ్రీనగర్లో 2 గ్రనేడ్లతో జర్నలిస్టు పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. జర్నలిస్టు ఆదిల్ ఫరూఖ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దినెలల క్రితం మరో జర్నలిస్ట్ రాజీవ్ శర్మను ఇదే తరహాలో పోలీసులు అరెస్ట్ చేశారు. రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక పత్రాలు, సరిహద్దు వ్యూహాల్ని చైనాకు పంపినందుకు అతన్ని అరెస్ట్ చేశారు. నెలల వ్యవధిలో జర్నలిస్టులే ఇలా దేశ విద్రోహ చర్యలకు పాల్పడుతూ పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. అసలీ జర్నలిస్టుల వెనక ఎవరున్నారో తేల్చాలనే డిమాండ్లు…వారి వెనక ఏవో విదేశీ సంస్థల కుట్ర ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

                                                                    



