“బ్రహ్మ సత్యం జగన్మిథ్య:” అన్నారు జగద్గురు ఆదిశంకరులు.
ఇక’అఖాడ’ ఆలోచన వెనుక ఉన్న శక్తీ ఆయనేనని చాలామందికి తెలీదు. మొదట
ఆదిశంకరాచార్య ‘దశనామి’ సంప్రదాయాన్ని స్థాపించారు, అతను సన్యాసులను రెండు వర్గాలుగా విభజించాడు. ఇది నాగ సాధువులను (దశనామి సంప్రదాయం ఉప-సమితి) సూచిస్తుంది, ఇది హిందూ సైన్యంగా వ్యవహరించడానికి శంకరాచార్య సృష్టించిన సాయుధ క్రమాన్ని సూచిస్తుంది.
547 CE, ఆవాహన్ అఖాడా
646 CE, అటల్ అఖాడా
749 CE, నిర్వాణి అఖాడా
1146 CE, జునా(భైరవి) అఖాడా
1856 CE, ఆనంద్ అఖాడా
1904 CE, నిరంజని అఖాడా
జనం సంచారంలోకి రాని లక్షలుగా వీళ్ళ ఉనికి ప్రపంచానికి తెలియడానికి … కుంభమేళాలో అందరినీ ఒకచోటికి చేరమని చెప్పింది ఆయనే. అలాగే శంకర పరంపరలోని ఉత్తరామ్నాయ శంకరాచార్యుల వారి మాటకు కట్టుబడి ఉండమని ఆది శంకరాచార్యుల వారు వారికి మార్గదర్శనం చేశారు.
కుంభమేళా మొదటి రోజున ఏమవుతుందో చాలామందికి తెలియదు, కుంభమేళా మొదలు అయ్యేది ఆమ్నాయ జగద్గురు శంకరాచార్యుల వారి పూజతో, తరువాత కుంభమేళా స్నానాలు అవుతాయి. అప్పుడు అక్కడ నాగసాధువులు అఖాడాలు జగద్గురు శంకరాచార్యుల వారికి గౌరవ వందనం చేసి “మేము దేశం లోపలికి వచ్చి మా యుద్ధంతో చేయవలసిన పరిస్థితి ఏమైనా వచ్చినదా, ఆజ్ఞ ఇవ్వండి” అని అడుగుతారు.ఒకవేళ వాళ్లే దేశంలోపలికి వచ్చి యుద్ధం మొదలు పెడితే హిందూత్వ శత్రువులు మిగలరు, అంత పరిస్థితి ఇంకా రాలేదు వచ్చినప్పుడు కబురు పంపిస్తాము అని సమాధానం ఇచ్చి పంపిస్తారు ఉత్తర ఆమ్నాయ జగద్గురు శంకరాచార్యుల వారు.
అఖాడాలు అనుజ్ఞని తీసుకుని గౌరవ వందనం చేసి మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటామని చెప్పి వెళతారు.
~ Paripurna Chary