ముఖేష్ అంబానీని పక్కకు నెట్టి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ. ET Now కథనం ప్రకారం….బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నుండి వచ్చిన డేటా ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మొత్తం నికర విలువ 91 బిలియన్ డాలర్లు కాగా….అదానీ గ్రూప్ చైర్మన్ విలువ 88.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ముఖేష్ అంబానీ నికర విలువ సంవత్సరానికి 14.3 బిలియన్లకు చేరుకోగా, గౌతమ్ అదానీకి ఇది 55 బిలియన్లకు చేరుకుందని ఇండెక్స్ తెలియజేసింది.
టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు, తరువాత జెఫ్ బెజోస్ మరియు బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు. అంబానీ, అదానీ వరుసగా 12, 13 స్థానాల్లో నిలిచారు.ప్రపంచంలోని టాప్ 500 మంది ధనవంతుల రోజువారీ ర్యాంకింగే బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ . అంతకు ముందు నెలలో, అంబానీ మొత్తం నికర విలువ 101 బిలియన్ డాలర్లు కాగా…అదానీ గ్రూప్ చైర్మన్ మొత్తం నికర విలువ 73.3 బిలియన్ డాలర్లుగా ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ సౌదీ అరామ్కోకు తన వాటా విక్రయాన్ని తిరిగి మూల్యాంకనం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, మార్కెట్‌పై ఒత్తిడికి గురైంది. 1.48 శాతం నష్టంతో రూ.2,350.90 వద్ద ముగిసింది. దీనికి విరుద్ధంగా, అదానీ గ్రూప్ స్టాక్స్ లాభాల బాటలో ట్రేడ్ అవుతున్నాయి. బుధవారం అదానీ ఎంటర్ప్రైజెస్ 2.76 శాతం లాభంతో రూ.1,754.65 వద్ద, అదానీ పోర్ట్స్ 4.59 శాతం లాభంతో రూ.762.75 వద్ద క్లోజయ్యాయి.
అంబానీ సంపద నిన్నటితో పోలిస్తే 1.32 బిలియన్ డాలర్లకు పడిపోతే…ఆదానీ నికర విలువలో 375 మిలియన్ డాలర్లు పెరగడం గమనించవచ్చు.
ఆన్లైన్ పబ్లికేషన్ మనీకంట్రోల్ ద్వారా … గ్రూప్ మార్కెట్ క్యాప్ ఆధారంగా అదానీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ …..రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌ను దాటారు. 2015 నుండి అంబానీ ఆసియాలో మొదటి ర్యాంకులో ఉన్నారు. ఇక బిలియనీర్ల ఇండెక్స్‌లోని ఇతర ప్రముఖ భారతీయూల్లో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ (34వ స్థానం), హెచ్‌సిఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ (54వ స్థానం), డి-మార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ (64వ స్థానం) ఉన్నారు.