ఇరాన్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై అసత్యాలు ప్రచారం చేశారనే ఆరోపణలపై ప్రముఖ నటి తరానెహ్ అలీ దూస్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా కాలంగా ఆమె ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ వస్తున్నారు. నిరసనలకు మద్దతు ప్రకటించిన పలువురు సెలబ్రిటీలు కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. రెండు నెలల కాలంలో ఇద్దరిని ఉరితీశారు.ఆస్కార్ విన్నింగ్ మూవీ ది సేల్స్ మాన్, ది బ్యూటిఫుల్ సిటీ, ఎబౌట్ ఎల్లీ వంటి సినిమాల్లో నటించింది తరానెహ్.