తెలుగు హీరోయిన్ లావణ్య మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు కానీ ఈసారి ఆమె కేసులో ఇరుక్కోలేదు. స్వయంగా ఆమె ఎదురు కేసు నమోదు చేశారు.
ఇప్పుడు లావణ్య ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ చెబుతున్నారు. లావణ్య బాయ్ ఫ్రెండ్ గా పాపులర్ అయిన హీరో రాజ్ తరుణ్ ఆమెకు గుడ్ బై చెప్పేసారు. తిరగబడరా నా స్వామి అనే సినిమాలో రాజు తరుణ్ నటించారు. అందులో హీరోయిన్ గా నటించిన మాల్వీ మల్హోత్రా కు రాజ్ తరుణ్ దగ్గర అయ్యారు అనేది ఇప్పుడు లేటెస్ట్ టాక్. ఈ ఇద్దరూ రిలేషన్ షిప్ లో సెట్ అయిపోవడంతో లావణ్య ని దూరం పెట్టారు అని తెలుస్తోంది.
దీంతో ఒళ్ళు మండిపోయిన లావణ్య నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చేసారు.
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
11 ఏళ్లుగా తాను, రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నట్లు తెలియ చేశారు. తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా పోలీసులకు ఆమె అందించారు.
ఇంకో కొత్త హీరోయిన్ మల్హోత్రా తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపిస్తున్నారు.
రాజ్‌తరుణ్‌ను వదిలేయాలని.. లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్లో పేర్కొన్నారు.
అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని.. 45 రోజులు జైల్లో ఉన్నానని ఆమె వాపోతున్నారు. దీని వెనక కూడా రాజ్ తరుణ్ ఉన్నారని లావణ్య చెబుతున్నారు.
3 నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు లావణ్య అంటున్నారు.
హిమాచల్ ప్రదేశ్ CM తమ నాన్నకు ఫ్రెండ్ అనీ, తాము తలచుకుంటే ఏమైనా చేయగలమని మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మాయాంక్ తనను బెదిరించినట్లు లావణ్య ఆరోపించారు . మాల్వీ ట్రాప్‌లో పడి, రాజ్‌తరుణ్ తనను దూరం పెడుతున్నాడని లావణ్య అంటున్నారు . కానీ తాను రాజ్‌తరుణ్ లేకపోతే ఉండలేనని,, తాను రాజ్‌తరుణ్‌తో కలసి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
మొత్తం మీద లావణ్య చెబుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీని పరిష్కరించడం పోలీసులకు కష్టంగా మారుతోంది. రెండు పక్షాల్ని పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు.