యాక్షన్ కింగ్ అర్జున్ తన ఇష్టదైవం ఆంజనేయస్వామికోసం ఓ ఆలయాన్ని కట్టాడు. చైన్నై విమానాశ్రయానికి సమీపంలో సొంత స్థలంలో అత్యద్భుతంగా ఈ కోవెల కట్టాడు. ఇవాళ, రేపు ఆలయంలో కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. పదిహేనేళ్ల క్రితం ఆలయ నిర్మాణ ప్రారంభ పనులు మొదలయ్యాయి.
ఇన్నేళ్లకు పూర్తైంది. సన్నిహితులు, కొందరు బంధుమిత్రుల్ని ఈ వేడుకకు ఆహ్వానించాడు అర్జున్.