బుల్డోజర్లతో ఇళ్లు కూల్చేస్తూ అలహాబాద్ జడ్జిలా యోగీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్. బీజేపీ నేత నూపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 10 శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళన చేపట్టిన సంగతితెలిసిందే. యూపీలోనూ పలుచోట్ల అల్లర్లు జరిగాయి. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రయాగరాజ్ అల్లర్లకు ప్రధాన సూత్రధారి అయిన జావేద్ అహ్మద్ ఇంటిని యోగి సర్కారు కూల్చివేసింది. గుజరాత్ లోని కచ్ లో ఓ ర్యాలీలో మాట్లాడుతూ సీఎం పై విరుచుకుపడ్డారు. యూపీ సీఎం యోగి అలహాబాద్ ప్రధానన్యాయమూర్తిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎవరినైనా దోషులుగా నిర్ధారిస్తారా? వారి ఇళ్లను కూల్చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.