ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి బీజేపీ వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్ట్ స్పందించింది. పోలీసుల దర్యాప్తుపై కోర్టు స్టే విధించింది. అలాగే 8 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. మునుగోడు ఉప ఎన్నిక ముగిసే వరకు విచారణ వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 4కు వాయిదా వేసింది.
ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను రిమాండ్‌కు అప్పగించాలంటూ సైబరాబాద్ పోలీసులు వేసిన రివిజన్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతించింది. ప్రభుత్వ అప్పీల్‌ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటూ…వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశించింది.