ఇస్లామిక్ చట్టం ప్రకారం.. మైనర్ బాలికను కూడా పెళ్లి చేసుకోవచ్చంటూ హై కోర్టు తీర్పు..!
ఇస్లామిక్ చట్టం ప్రకారం యుక్త వయస్సులో ఉన్న మైనర్ ముస్లిం బాలిక తన ఇష్టం మేరకు పెళ్లి చేసుకునే హక్కు ఉందంటూ పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. ఇస్లామిక్ చట్టంలోని ఆర్టికల్ 195లో ఉన్న అంశాన్ని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. యుక్త వయసు మైనర్లు తమ ఇష్టం మేరకు గార్డియన్ అనుమతి ఉన్నా.. లేకపోయినా పెళ్లి చేసుకోవచ్చని.. ఆ ఆర్టికల్‌లో చెప్పిన విషయాన్ని ఈ తీర్పు విషయంలో ప్రస్తావించింది.
పంజాబ్‌కు చెందిన ఓ ముస్లిం జంట వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ అల్కా సరిన్ ఈ తీర్పును ఇచ్చారు. 37 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి.. 17 ఏళ్ల వయస్సు ఉన్న అమ్మాయి గత నెల 21వ తేదీన వివాహం చేసుకున్నారు. అయితే వాళ్లిద్దరి పెళ్లి ఇష్టం లేని కుటుంబ సభ్యులు తమను బెదిరిస్తున్నారంటూ వాళ్లనుంచి రక్షణ కల్పించాలంటూ ఈ జంట కోర్టును ఆశ్రయించింది. సదరు యువతి మైనర్ అయినా కూడా ఇస్లామిక్ చట్టం ప్రకారం వీరి వివాహం చెల్లుతుందని తీర్పునిచ్చిన కోర్టు.. ఈ జంటకు రక్షణ కల్పించాలని మొహాలీ ఎస్ఎస్పీని ఆదేశించింది.