పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం పంపుహౌజ్ లోకి క్రేన్ సాయంతో దిగుతుండగా.. దానికి చెందిన ఒక వైర్ తెగి ఐదుగురు కార్మికులు మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రేగుమనగడ్డ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. మృతులను బీహార్ నుంచి వచ్చిన వలస కూలీలుగా గుర్తించారు.