విశ్వహిందూ పరిషత్ ,బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈరోజు పంజాగుట్ట లో ఉన్న స్మశాన వాటికాను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు గారు
రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్ గారు
బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్, కో కన్వీనర్ కుమారస్వామి ,మరియు స్మశాన వాటిక కమిటీ మెంబర్స్ కాలనీవాసులు విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ కార్యకర్తలు కలిసి ఈ రోజు పంజాగుట్ట స్మశాన వాటికలో జిహెచ్ఎంసి అధికారులు సమాధులను తొలగించి రోడ్డు నిర్మించడాన్ని తీవ్రంగా ఖండించి నారు హిందువులకు ఎంతో భక్తిశ్రద్ధలతో తన పూర్వీకులను పిత్రులను ,పూజించుకుంటారు సమాధులను సందర్శిస్తుంటారు అలాంటి సమాధులను జిహెచ్ఎంసి అధికారులు తొలగించడం చాలా సిగ్గుచేటు విషయమని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు గారు రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్ గారు అన్నారు . గతంలో కేశవరావు ,సమాధుల స్థలాన్ని ఆక్రమించిన్నారు, మసీదుకు స్థలాన్ని ఇవ్వడం జరిగింది. రోడ్డు వేయడం లో అనేక సమాధులు తొలగించబడినవి కానీ ఈరోజు కొత్తగా జిహెచ్ఎంసి అధికారులు మరియొక రోడ్డు నిర్మించుటకు సిద్ధమవడం బాధాకరమైన విషయం హిందువుల మనోభావాలు ఈ అధికారులకు అర్థం కావడం లేదా ?, ప్రశ్నించిన్నారు
ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు తమ వైఖరి మార్చుకుని స్మశాన వాటికలో ఎలాంటి నిర్మాణాలు నిర్మించారాదు అని హెచ్చరిక చేసిన్నారు. అక్కడ జరిగే పనిని బజరంగ్దళ్ కార్యకర్తలు అడ్డుకొని నిలిపి వేయడం జరిగింది అధికారులతో మాట్లాడే వరకు ఎలాంటి పనులు ఇక్కడ జరగరాదని అధికారులకు హెచ్చరించారు
హైదరాబాద్ నగరంలో అమీర్పేట్ లో ముస్లింల సమాధులు అంబర్పేటలో రోడ్డు పక్క ఇరువైపులా ముస్లిం సమాధులు ట్యాంక్ బండ్ వద్ద ముస్లింల సమాధులు రోడ్డుకు ఇబ్బంది గా ఉన్నవని ఈ యొక్క అధికారులకు తెలియవా వాటి గురించి ఎందుకు ఆలోచించలేక పోతున్నారు వాటిని ముట్టుకునే దమ్ములేని జిహెచ్ఎంసి అధికారులు చాతగాని దద్దమ్మలు హిందువుల సమాధులను తొలగించడం ఎంత వరకు సమంజసమని బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్ ప్రశ్నించారు.
అధికారులు వైఖరి మార్చుకుని హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని పంజాగుట్ట స్మశాన వాటికలో నిర్మిస్తున్న రోడ్డు పనులను మానుకోవాలని తెలియజేస్తున్నాం లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు మరియు దేవరకొండ బస్తినాయకులు, స్మశాన వాటిక కమిటీ నాయకులు, పాల్గొనడం జరిగింది