ABVP ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీలోని గర్ల్స్ హాస్టల్ లో నాణ్యమైన ఆహారం మరియు కనీస మౌలిక సదుపాయాలు అయిన త్రాగునీరు, బాత్రూం ల నిర్వహణ సక్రమంగా చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులకు గురవుతున్నామని, అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.