అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశాలకు రంగం సిద్ధం అయింది. దీనదయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయంలోని సంవాద్ భవన్లో ABVP జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ రాజశరణ్ షాహి, జాతీయ ప్రధాన కార్యదర్శి యాగైవల్క్య శుక్లా మరియు జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆశిష్ చౌహాన్ ఈ కార్యక్రమం ను ప్రారంభించారు . సరస్వతి మరియు స్వామి వివేకానంద చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడంతో సమావేశం ప్రారంభమైంది.
ఏబీవీపీ జాతీయ కార్యనిర్వాహక మండలి (ఎన్ఈసీ) సమావేశం నవంబర్ 21న గోరఖ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో జరగనుంది. పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ తృతీయ జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మానవందన యాత్ర .. ఈ జాతీయ సదస్సు కోసం గోరఖ్‌పూర్‌కు చేరుకున్నది. మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ నుండి ప్రారంభమైన ఈ యాత్ర ప్రయాగ్‌రాజ్ మరియు అయోధ్య వంటి నగరాల గుండా సాగింది, భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని పునరుజ్జీవింపజేయడానికి అహల్యాబాయి చేసిన కృషి గురించి అవగాహన కల్పించారు. ఈ ప్రయత్నాలను తెలియ చేసే ఎగ్జిబిషన్‌ను విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రారంభించారు.
National President Prof. @DrRajSharan, National General Secretary Shri @yagywalkya and National Organising Secretary Shri @AshishSainram inaugurate the National Executive Council meeting ahead of #70thABVPConf. pic.twitter.com/EofRWiaAZS
— ABVP (@ABVPVoice) November 21, 2024
ఏబీవిపీ కేంద్ర కమిటీ సమావేశంలో .. విద్య మరియు సామాజిక అంశాలపై ముఖ్యమైన చర్చలు ఉన్నాయి. 70వ ఏబీవీపీ జాతీయ సదస్సులో ప్రవేశపెట్టనున్న ఐదు కీలక తీర్మానాలపై కూలంకషంగా చర్చ జరుగుతుంది. ఈ తీర్మానాలు వరుసగా … విద్యాసంస్థల్లో విద్య నాణ్యతను మెరుగుపరచడం, ఫీజుల పెంపుదల, కల్తీ ఆహార ఉత్పత్తుల విక్రయాలను ఎదుర్కోవడం, అంతర్జాతీయ వేదికపై భారతదేశం ప్రభావం మరియు మణిపూర్‌లో కొనసాగుతున్న హింసపై దృష్టి సారిస్తుంది. నవంబర్ 22 నుంచి 24 వరకు జరిగే ఏబీవీపీ జాతీయ సదస్సులో ఈ తీర్మానాలను అధికారికంగా ఆమోదించనున్నారు.