విద్యార్థి లోకం పులకరించే రోజు ౼ జులై 9 వ తేది.
అప్పుడే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 73 వ సంవత్సరం లోకి ప్రవేశించింది. ABVP అనే నాలుగు అక్షరాల మహత్తు ఏమిటో గాని ప్రారంభించబడిన నాటి నుండి నాలుగు దిశలలో విస్తరిస్తూనే ఉంది.విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పాలిట వరమై, దేశద్రోహుల పాలిట సింహస్వప్నమై…. అనేకమైన విద్యారంగాలలోకి ప్రవేశించి దిశా దర్శనం చేస్తుంది. MeDeVision పేర వైద్యవిద్యార్థులను, టెక్నికల్ సెల్ పేర ఇంజనీరింగ్ విద్యార్థులను, Think India పేర కేంద్రీయ విద్యా సంస్థల విద్యార్థులను, రాష్ట్రీయ కళా మంచ్ పేర విద్యార్థి కళాకారులను…..ఇలా అనేక విద్యారంగాలల్లో విద్యార్థులలో జాతీయ భావన కాంక్షను రగిలిస్తూ విద్యా రంగంలో జాతీయ పునర్నిర్మాణం వైపు అప్రతిహతంగా దూసుకొని పోతుంది. 35 లక్షల సభ్యత్వం, 7000 స్థలాలకు పైగా పని కలిగి ఉండడం వల్ల ప్రపంచం లొనే అతిపెద్ద విద్యార్థి సంస్థ అనడం లో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి ABVP ప్రారంభించబడిన రోజు జులై 9వ తేదీని జాతీయ విద్యార్థి దినోత్సవం గా జరుపుకోవడం నిజంగా ఒక గొప్ప సంబరమే.