పెంచిన బస్ పాస్ ఛార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏ బీ వీ పీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఎండి సజ్జనర్ కి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా హైదరాబాద్ మహానగర కార్యదర్శి పృథ్వితేజ మాట్లాడుతూ ప్రజా రవాణాలో ప్రయాణిస్తూ చదువుకునే విద్యార్థుల బస్ పాస్ చార్జీలు పెంచడాన్ని ఎబివిపి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అన్నారు. ఇప్పటికే విద్యార్థుల బస్ పాస్ చార్జీలు ఆకాశాన్ని అంటుతున్నాయి,, మళ్ళీ చార్జీలను పెంచాలని చూడటం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడమే అని పేర్కొన్నారు. ఫ్రీ బస్ కారణంగా సరిపడ బస్ లు లేక విద్యార్థులు తమ ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తున్నారు అని చెప్పారు . విద్యార్థులకు సరిపడ బస్ లు నడపడం చేత కానీ అధికారులు,, బస్ పాస్ చార్జీలు మాత్రం పెంచడానికి సిద్ధం అవుతున్నారు అని మండిపడ్డారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఫ్రీ బస్ హామీ కారణంగా వస్తున్న నష్టాన్ని భర్తీ చేయటానికే విద్యార్థుల మీద భారం మోపుతోంది అని ఎబివిపి భావిస్తునది. ఒక వైపు బస్సులు లేక మరోవైపు విపరీతమైన చార్జీలతో విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్ళే అవకాశం తగ్గిపోతుంది.
బస్ పాస్ ఛార్జీలు పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని విద్యార్థులకు పాత బస్ పాస్ చార్జీలే నిర్ణయించాలని ఎబివిపి డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అని హెచ్చరించారు.