“గోవుల్ని కాపాడేందుకు వెళుతోన్న హైందవ వీరులు యాక్సిడెంట్ కారణంగా మరణించారు! దీనిపై ఓ ఫేస్బుక్ స్నేహితుడి వాల్ మీద ఆసక్తికర చర్చ సాగుతోంది. నిజానికి వాళ్లు అకాల మరణం పాలయ్యారని తెలియగానే నాక్కూడా చాలా బాధేసింది. కానీ, సదరు మిత్రుడు అదే విషయం చెబుతూ ‘చాలా పదునైన సంగతి’ ఒకటి ప్రస్తావించారు. కేంద్రంలోని ప్రభుత్వానికి తెలియకుండా బీఫ్ (అవు మాంసంతో సహా…) అమ్మకాలు, కొనుగోళ్లు జరగవు! ఇది పచ్చి నిజం… సందేహమే లేదు!
మరైతే గోవధలన్నిటికి మోదీ సర్కారే కారణమా? ఒక విధంగా అవునని చెప్పక తప్పదు. కానీ, మరో కోణం కూడా గోవధ విషాదం వెనుక దాగుంది. దేశంలో గోమాతల దారుణ, దయనీయ స్థితి మారాలంటే కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుందా? గోవధ నిషేధం చట్టం తీవ్రంగా అమలు చేస్తే వెంటనే జరిగేదేంటి? ప్రతిపక్షలు, లెఫ్టు గ్రూపులు, మీడియా మాఫియాలు, అన్నీ, అందరూ మైనార్టీలతో, దళితుల్లోని కొన్ని వర్గాలతో కలిసిసోతారు. సీఏఏ, వ్యవసాయ చట్టాల కంటే మించిన హింస, గందరగోళం సృష్టిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ మరోసారి ప్రభుత్వ ఏర్పాటుపై ఆశ వదులుకుని గోవధ నిషేధానికి పూనుకోవాలి! ఎందుకంటే, మోదీ శత్రవులు అందరూ ఏకం అవుతారు. గోవధ నిషేధం చేసినందుకు హిందువులు కారు. కులం, ప్రాంతం, భాష, సినిమా పిచ్చి… ఇవన్నీ సెక్యూలర్ హిందువులకి కావాలి. ఆవులు ఎవడికి కావాలి? ఇదే అసలు ప్రశ్న…
హిందువుల్లో నిజంగా గోమాత బ్రతకాలని కోరుకుంటోన్నది ఎంత మంది? చాలా మందికి ఆవు అనే ఆలోచనే మనసులో ఉండదు. వారిలో చైతన్యం కలిగించేంత ఓపిక హిందూ మత పెద్దలకు ఉండదు. ఇంకా కొందరైతే ఆవు కూడా కోడి, గొర్రె లాంటి జంతువే అంటారు. వారికి బీఫ్ తినటం మైనార్టీలకు మద్దతు తెలపటంలో భాగం! ఆవు మాంసానికి, దళితులకి లింకు పెట్టి రాజకీయాలు, ఉద్యమాలు చేసే వారు కూడా ఎలాగూ ఉన్నారు! వీళ్లంతా పోనూ… గోవు బ్రతకాలని కోరుకునే వారు ఎందరు? అతి తక్కువ మంది… వారిలో భాగమే… పాపం యాక్సిడెంట్లో మరణించిన ‘ధర్మ వీరులు’…
గోవుల్ని కాపాడతామని హిందువుల్లో కేవలం కొన్ని వేల మంది దేశ వ్యాప్తంగా పోరాడుతున్నారు. మిగతా వారు చేస్తున్నదేంటి? వారి ఉద్దేశం ఏంటి? ఏమీ మాట్లాడకపోవటమే వాళ్ల మనోగతం. లేదంటే, ధర్మం కోసం ఎవరైనా ప్రాణాలు అర్పిస్తే రిప్ లేదా ఓం శాంతి అని తమ పనిలో తాము పడిపోవటం. ఇంతే తప్ప.,.. ఓ సాధారణ బజరంగ్ దళ్ కార్యకర్త మొదలు మోదీ వరకూ ఎవరూ గోవు కోసం రిస్క్ తీసుకున్నా… 70, 80 కోట్ల హిందువులు ఎవరూ ఆదుకునేందుకు ముందుకు రారు. ఇదీ నిష్ఠురమైన నిజం.
ఆవు కోసం పోరాడితే మామూలు కార్యకర్తల జీవితాలు పోతాయి. రాజకీయ నేతల ప్రభుత్వాలు కూలుతాయి. అయినా సరే… ధర్మం కోసం యుద్ధం చేసేటప్పుడు… కొందరు నిజమై వీరులు ప్రాణాలు త్యాగం చేస్తారు. స్వయంగా శ్రీకృష్ణుడి చెల్లెలి కొడుకు, అర్జున తనయుడు అయిన అభిమన్యుడు ధర్మం కోసమే 16 ఏళ్ల చిరు ప్రాయంలో మరణించాడు. భీముడంతటి బలవంతుడి కొడుకైన ఘటోత్కచుడు కూడా కురుక్షేత్రంలో వీర మరణం పొందాడు. ద్రౌపది, పాండవుల పుత్రులైన ఉప పాండవులు కూడా ధర్మ యుద్ధంలో హతులయ్యారు. స్వంత అన్నని కూడా వదిలి విభీషణుడు రాముని పక్షాన నిలిచింది ధర్మం కోసమే. అయితే, ఎవరూ ఏ త్యాగం చేసినా వారికి వ్యక్తిగతం కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ. అందుకే సమాజంలో అత్యధికులు ధర్మ రక్షణ జోలికి వెళ్లారు. అప్పుడైనా, ఇప్పుడైనా…
ఇంతకీ, గోరక్ష కోసం ఉద్యమించాలా వద్దా? ఈ ప్రశ్నకి సమాధానం ధర్మం కోసం పోరాటం చేస్తున్న యువత తమకు తాము వేసుకోవాలి. గోవుల్ని రక్షించటమే కాదు… మొత్తం భారతదేశాన్నే అవైదిక మతాలు, సెక్యులర్ భావజాలం నుంచీ కాపాడాలి. అందుకోసం కోట్లాది మంది సాధారణ గొర్రెల్లాంటి హిందువుల్ని ముందు చైతన్యవంతం చేయాలి. అత్యధిక శాతం మంది కోరుకుంటేనే, నడుం బిగిస్తేనే ఆవులైనా, వేదాలైనా, గుళ్లైనా, యావత్ సనాతన ధర్మమైనా కాపాడబడేది. కేవలం అక్కడక్కడ పది, పాతిక మంది ఆవేశంగా యుద్ధానికి దిగితే రక్తపాతం, మానసిక క్షోభ, అవైదిక మతాల గెలుపు తప్ప ఇంకేం మిగలదు…” – జైసింహ చతుర్వేది