డిల్లీ కార్పొరేషన్ ఎన్నికల వేళ ఆప్ అవినీతిపై ఆరోపణలు చేస్తూ ఓ వీడియో బయటపెట్టింది బీజేపీ. పార్టీ అభ్యర్థి ముకేష్ గోయెల్ ఒక ఎంసీడీ ఇంజనీర్ నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్టు బీజేపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించి స్టింగ్ ఆపరేషన్ చేసిన ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆదర్శ్ నగర్ నుంచి ముకేష్ గోయెల్ పోటీలో ఉన్నాడు.
పార్టీ నేతలకు కానుకలివ్వాలంటూ ఆ ఇంజినీర్ నుంచి గోయెల్ కోటి రూపాయలు అడిగినట్టు అందులో ఉంది. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన అతనిపై కేజ్రీవాల్ తక్షణం చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేజ్రీవాల్‌కు గోయెల్ కుడిభుజం అని, ఆయనను సంప్రదించకుండా ఎంసీడీకి చెందిన ఏ విషయంలోనూ సీఎం నిర్ణయం తీసుకోరని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. అయితే ఆ వీడియో ఫేక్ అని కొట్టిపారేశారు ముఖేష్ గోయల్. ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ ఇలాంటి ఎత్తుగడలు పన్నుతోందని మండిపడ్డారు. ఫేక్ వీడియోపై చట్టపరంగా ముందుకెళ్తాన్నారు. ఐదుసార్లు మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్న గోయెల్ గత ఏడాది నవంబర్‌లో కాంగ్రెస్ పార్టీని వీడి ఆప్ లో చేరారు.
LIVE: दिल्ली प्रदेश मुख्यालय पर प्रेसवार्ता को संबोधित करते हुए। https://t.co/i5fqTUtzq7
— Sambit Patra (@sambitswaraj) November 18, 2022