తెలంగాణలో ఆరు విమానాశ్రయాల అభివృద్ధికోసం సాంకేతిక సాధ్యాసాధ్యాలపై నివేదికను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) రాష్ట్రప్రభుత్వానికి అందచేసింది. రాష్ట్ర ప్రభుత్వ తదుపరి చర్యల ఆధారంగా ఈ ప్రాజెక్టుల పనులు సాగుతాయని మంత్రి వీకేసింగ్ అన్నారు. లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు.
అలాగే…హృదయ్ పథకం కింద చేపడుతున్న వరంగల్ కోట అభివృద్ధి పనులు 2022 మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు మరో మంత్రి కౌశల్ కిశోర్.