ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన విద్యార్థులు.. చదువులమ్మ గుడిలో కలుసుకుంటారు. చదువుల తల్లి సరస్వతి సాక్షిగా స్నేహితులుగా మారతారు. బాల్యంలో, శిశు మందిరాల్లో ఏర్పడిన స్నేహం ఎప్పటికీ ఆత్మీయంగానే ఉంటుంది . ప్రతి వాళ్ళ జీవితంలో చిన్ననాటి పాఠశాల అంటే ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ అని అనుకోవాలి.
కోనసీమ లోని మారుమూల గ్రామం అయినాపురం కు చెందిన శిశు పాఠశాలలో చాలామంది విద్యార్థులు చదువుకొన్నారు. చుట్టుపక్కల ఉండే పల్లిపాలెం బొర్రాగట్టు, బాడవ , సోమిదేవర పాలెం వంటి ప్రాంతాలకు ఇదే ఏకైక పాఠశాల.
అటువంటి చోట చదువుకున్న 1966-67 బ్యాచ్ విద్యార్థులు ఒకచోట కలిశారు . దాదాపుగా కుటుంబాలను పూర్తిగా చక్కబట్టేసుకుని ప్రశాంతమైన జీవితం గడుపుతున్న వారంతా అక్కడకు వచ్చారు. అయినాపురం పాఠశాలతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎక్కడెక్కడో స్థిరపడిన బాల్య మిత్రులను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న వారు కొందరైతే,, ఆనందంతో హత్తుకున్న వారు మరికొందరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వీరంతా.. వయసు రీత్యా 60 దాటిన వారే. కానీ ఒకసారిగా చిన్ననాటి స్నేహితులను చూడగానే బాల్యంలోకి మరలిపోయారు. చిన్నతనంలో చేసిన అల్లరి అంత గుర్తు చేసుకుంటూ,, బాల్యాన్ని కళ్ళ ముందు నిలిపారు. రోజంతా బాల్య స్నేహితులతో ఆనందంగా గడిపారు. చక్కటి అనుభూతుల్ని ఒడిసి పట్టుకుని స్వస్థలాలకు వెళ్లారు. ఈ కార్యక్రమ నిర్వహణలో చొరవ చూపిన మిత్రులను మనసారా అభినందించారు. మరోసారి కుటుంబాలతో సహా కలుద్దాం అంటూ ఒట్టు వేసుకుని ముందుకు సాగారు.
సో, ఇదండీ.. 60 ఏళ్ల సీనియర్ సిటిజన్స్ యొక్క జూనియర్ స్కూల్ మెమరీస్.. ఒక ముక్కలో చెప్పాలంటే వాళ్ళ
ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ ..
More Photos :