క్రైస్తవ చర్చిలకు భారీ షాక్.. మోదీ మార్కు చెక్ ..!
బ్రిటీష్ కాలం నాటి చట్టాలను అడ్డం పెట్టుకొని, కుంటి సాకులు చెబుతున్న క్రైస్తవ చర్చిలకు షాక్ తగిలింది. ప్రజలు అందరితో పాటు.. చర్చిలలో సేవలు అందించే పాస్టర్లు, నన్ లు సమానమే అని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వాదనకు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆమోద ముద్ర వేసింది. వివరాలు చూస్తే కళ్లు చెదిరే వాస్తవాలు బయట పడతాయి.
బ్రిటీష్ కాలంలో చాలా చీకటి చట్టాలు తయారు చేసి పెట్టారు. అందులో భాగంగా భారతదేశంలో మత మార్పిడులకు కేంద్రంగా నిలిచే మిషనరీ పాఠశాలలను సేవా కేంద్రాలుగా చూపించారు. ఈ పాఠశాలల్లో సేవలు అందించే పాస్టర్లు మరియు క్రైస్తవ నన్ ల జీతాలను సేవగా పరిగణించాలని, ఎటువంటి పన్నులు వసూలు చేయకూడదని చట్టం చేసి పెట్టారు.
స్వాతంత్రం తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ సెక్యులర్ ముసుగులో ఈ చట్టం జోలికి పోలేదు. పాస్టర్లు, నన్ లకు ఏడాదికి లక్షల్లో ఆదాయం వచ్చి పడుతున్నా పన్ను ఏమాత్రం అడగలేదు. మిగిలిన ఉద్యోగుల నుంచి ముక్కు పిండి ఆదాయపు పన్ను కట్టించుకొనే ప్రభుత్వ వర్గాలు.. చర్చిల జోలికి ఏమాత్రం పోలేదు. దీంతో మిషనరీ స్కూల్స్ లో భారీ జీతాలను ఈ పాస్టర్లు, నన్ ల రూపంలో లెక్క చూపించేసేవారు.
2014 లో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం .. ఈ పాస్టర్లు, నన్ లు కూడా ఇతర ఉద్యోగుల మాదిరిగా ఆదాయపు పన్ను కట్టాలని నోటీసులు ఇచ్చింది. దీంతో కోపం చెందిన క్రైస్తవ చర్చీలు ఏకమై పోయి సెక్యులర్ నాయకులతో శాపనార్థాలు పెట్టించాయి. ప్రతిపక్ష పార్టీలతో వార్నింగ్ లు ఇప్పించాయి. అవేమీ ఫలించక పోవటంతో కోర్టులలో న్యాయపోరాటాలు మొదలు పెట్టాయి. కింది కోర్టులు, ఆ పై జిల్లా కోర్టులు, తర్వాత హైకోర్టులు, చివరకు సుప్రీంకోర్టుల దాకా న్యాయపోరాటం నడిపించాయి. మిషనరీ స్కూల్స్ లో పాస్టర్ లు, నన్ లు చేస్తున్నది సేవ మాత్రమే అని, అది ఆధాయం కిందకు రాదంటూ వాదనలు వినిపించాయి
ఈ వాదనల్ని చివరగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ పార్ఠీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా తో కూడిన ధర్మాసన చారిత్రక తీర్పు వెలువరించింది. దేశంలోని ఇతర టీచర్లంతా ఆదాయపు పన్ను కడుతున్నపుడు, ఇక్కడ ప్రత్యేక మినహాయింపులు ఎందుకు అని సూటిగా ప్రశ్నించింది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను సమర్థించింది. దీంతో క్రైస్తవ చర్చిలకు షాక్ తగిలినట్లయింది.