Nagpur Riots || నాగపూర్ అల్లర్ల వెనుక భారీ కుట్ర..
నాగపూర్ వాస్తవానికి ఒక చారిత్రక నగరం. స్వాతంత్ర సమరంలో దేశ భక్తులను తయారుచేసిన ప్రాంతం. మరాఠా యోధులు ఛత్రపతి శివాజీ మరియు ఆయన కుమారుడు శంభాజీ లను .. అక్కడ ప్రజలు దైవంగా ఆరాధిస్తారు. అటువంటి శంభాజీని చిత్ర హింసలు పెట్టేసి చంపేసిన ఔరంగజేబు మీద అక్కడ ప్రజల్లో సహజంగానే కోపం ఉంటుంది. శంభాజీ జయంతి తర్వాత ఘట్టాలలో భాగంగా… ఔరంగజేబు దిష్టి బొమ్మను స్తానికులు తగలబెట్టి నిరసన తెలిపారు.
…
అంతే, సాయంత్రం ఒక ప్రణాళిక ప్రకారం స్తానిక మార్కెట్ నుంచి ఒక వర్గం వారి వాహనాలన్నీ దూరంగా వెళ్లిపోయాయి, వారి షాపులన్నీ బంద్ చేసుకొన్నారు. ఒక్కసారిగా హిందువుల దుకాణాలు, వాహనాల మీద దాడి చేసి లూఠీ చేసేశారు. వాహనాలను తగలబెట్టేసి మాస్ వార్నింగ్ లు ఇచ్చి వెళ్లారు. ఈ దేశంలో మహిళల్ని చెరబట్టి చిత్రహింసలు పెట్టిన ఔరంగజేబు ని చిన్న మాట అన్నా ఊరుకొనేది లేదంటూ హెచ్చరికలు చేశారు. అంటే, తాము తలచుకొంటే ఏదయినా చేయగలం అన్న మాస్ వార్నింగ్ ఇచ్చారన్న మాట.
…
దీని మీద మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొని వచ్చి, పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. అల్లరిమూకలను చెదరగొట్టి ప్రజలకు ధైర్యం కల్పించారు. ఈ ఘటన మీద విశ్వ హిందూ పరిషత్ స్పందించింది. శాంతికి మారుపేరుగా నిలిచే నాగపూర్ లో దాడులకు తెగబడ్డ జిహాదీ మూకల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది