సోషల్మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సందేశాత్మక, ఆలోచనాత్మక పోస్టులు షేర్ చేసే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజా ట్వీట్ ఆకట్టుకుంటోంది. చిన్నారులను ప్రమాదం నుంచి రక్షించేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ టీ షర్ట్ కు సంబంధించిన డెమో వీడియోను ఆయన ట్విట్టర్లో జతచేశారు.
చిన్నారులు ప్రమాదవశాత్తూ నీటిలో పడినా మునిగిపోకుండా తేలే టీషర్ట్ అది.
దాన్ని తయారుచేసిన ఫ్రాన్స్ కంపెనీ ఫ్లోటీ ఆవిష్కరణను ఆనంద్ మెచ్చుకుంటూ ‘దీనికి నోబుల్ రాకపోవచ్చు. కానీ నోబుల్ లభించిన ఆవిష్కరణల కన్నా సృజనాత్మకమైనది. ఎందుకంటే ఇద్దరు పిల్లల తాతయ్యగా వారి భద్రతే నాకు ముఖ్యం’అంటూ రాసుకొచ్చారు.
ఆయన షేర్ చెసిన వీడియోను ఇప్పటికే మిలియన్ కు పైగా నెటిజన్లు వీక్షించారు.
https://twitter.com/anandmahindra/status/1661685939276750849?s=20