కరీంనగర్ : మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కరీంనగర్ పోలీసులు కేసునమోదు.
కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా దేవీదేవుళ్లను అవమానిస్తూ వందలాది మందితో ప్రతిజ్ఞ చేశారని బీజేపీ రాష్ట్ర నాయకుడు బేతి మహేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ మహేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేశారు.
క్రైమ్ నెం: 144/2021, సెక్షన్లు153-A, 295-A, 298 r/w 34 IPC క్రింద కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

BJP Leader Bethi Mahendar Reddy

FIR copy