బలూచ్ రిబరేషన్ ఆర్మీ దాడిలో మొత్తం 95 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. బలూచీల ఆత్మాహుతిదాడిలో నోష్కీలో 45 మంది సైనికులు, పంజ్ గూర్లో సెక్టార్లో 50 మంది సైనికులు హతమయ్యారు. అయితే ఈ దాడుల్లో తమ వాళ్లు ఇద్దరు మాత్రమే చనిపోయారని పాక్ ఆర్మీ చెబుతోంది.
ముందుగా నోష్కీలోని ఆక్రమితఆర్మీ కార్యాలయంపై దాడి జరిగింది. బెలూచ్ పోరాటకారుడొకరు నిండా పేలుడుపదార్థాలున్న వాహనంతో కార్యాలయం మెయిన్ గేట్ ను ఢీ కొట్టాడు. దీంతో పెద్దఎత్తున పేలుడు సంభవించి లోపల ఉన్న 45 మంది పాకిస్తాన్ జవాన్లు అక్కడికక్కడే చనిపోయారు. ఆ వెంటనే వచ్చిన బెలూచ్ లిబరేషన్ ఆర్మీ శిబిరంలోని భూభాగాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంది.

Baloch Liberation Army(BLA) Official statement(Noshki Attack)
తరువాత కాసేపటికే పంజ్ గూర్ సెక్టార్‌లోనూ బెలూచ్ వీరులు మెరుపుదాడి చేసి 50మందిని హతమార్చారు. అయితే ఇంత పెద్దఎత్తున సైనికుల ప్రాణాలు పోతే పాకిస్తాన్ మాత్రం ఇద్దరు జవాన్లు మాత్రమే చనిపోయారంటోంది.

Baloch Liberation Army(BLA) Offical Statement(Panjgur Attack)
ఈ ఘటన పై మేజర్ సురేందర్ పునియా ట్వీట్ చేశారు. పెద్దసంఖ్యలో 95మంది జవాన్లు చనిపోతే వారి త్యాగాల్ని కూడా గౌరవించలేని స్థితిలో పాక్ ఆర్మీ ఉందని…పొరుగుదేశానికి కనీస నైతికత లేదని అన్నారు. బెలూచ్ లిబరేషన్ ఆర్మీతో పోరాటంలో పాక్ ఆర్మీలోని అంతమంది సైనికులు చనిపోతే ఇద్దరే చనిపోయారని నమ్మబలుకుతోందని పునియా అన్నారు.
A big attack on Pak forces in #Balochistan by Baloch freedom fighters.
Our sources in BLA confirming Pakistan lost 45 soldiers in Noshki & another 50 in Panjgur.
As always Pak Army saying they lost only 2 !
They NEVER honour the sacrifice of their soldiers…No Ethics 👎— Major Surendra Poonia (@MajorPoonia) February 3, 2022
పాకిస్తాన్ లో అతిపెద్ద,ముఖ్యమైన ప్రావిన్సుగా ఉన్న బెలూచిస్తాన్ ప్రత్యేక దేశం చేయాలంటూ స్థానికులు పోరాటం చేస్తున్నారు. తమను పాకిస్తాన్ లో బలవంతంగా, చట్టవిరుద్ధంగా కలిపారన్నది బలూచిస్తాన్ ప్రజల భావన. 1948లో బ్రిటీష్ పాలకులు వెళ్లిపోయాక బలూచ్ ప్రజలు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. అప్పుడు అందుకు ఒప్పుకున్న పాకిస్తాన్ తరువాత మాట మార్చింది. ఎన్నో సహజవనరులున్న బెలూచిస్తాన్ అభివృద్ధిలో చాలా వెనకబడి ఉంది. కనీస మౌలిక వసతులూ కల్పించక ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయి. దేశం ఏర్పడి 75 ఏళ్లు దాటినా …. బలూచ్ సమస్య అలాగే ఉంది. వేర్పాటు వాదుల పోరాటం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా బెలూచీల ఆత్మాహుతి దాడిలో ఏకంగా 95మంది సైనికులు చనిపోయారు.