ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 సంస్థలను తక్షణమే విభజించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. అందులో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చింది. దీంతో కేంద్రప్రభుత్వానికి, తెలంగాణ సర్కారుకు సుప్రీం నోటీసులు పంపించింది. షెడ్యూల్ 9,10 ల్లో ఉన్న సంస్థల విలువ దాదాపు లక్షా 42 వేల 601 కోట్లుగా
ఉండగా..దాదాపు 91 శాతం సంస్థలు తెలంగాణలో ఉన్నాయని పేర్కొంది. ఆ సంస్థల విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోతోందని..పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతకూ స్పందించడంలేదని సుప్రీం కోర్టుకు తెలిపింది ఆ రాష్ట్ర సర్కారు. తక్షణమే ఆయా సంస్థల విభజనకు ఆదేశాలివ్వాలని సర్వోన్నతన్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది.