దేశంలో గత 24 గంటల్లో 8,813 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. జూన్ 14 నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఇదే అత్యల్పం. అలాగే దేశంలో 29 మరణాలను కూడా సంభవించినట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసులు 1,11,252కి చేరుకోగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 4.15%గా ఉంది.