తేలు విషం ఏంటి.. ఇంత ధర ఏమిటి..! అని ఆశ్చర్య పోతున్నారా.. ఇది నిజంగానే నిజం. సహజంగా పాలు, పెరుగు అంటే ఆహార పదార్థాలు, కాబట్టి లీటర్ 100 రూపాయలు 80 రూపాయలకు అమ్ముతుంటారు. ఎందుకంటే వాటి వల్ల పోషకాలు లభిస్తాయి. కానీ తేలు విషానికి డిమాండ్ ఉండటం ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా ఔషధాల తయారీలో తేలు విషం చాలా బాగా ఉపయోగపడుతుందట. ముఖ్యంగా ఐరోపా, గల్ఫ్ దేశాలలో యాంటీబయోటిక్స్, కాస్మెటిక్స్, పెయిన్ కిల్లర్స్ తయారీలో తేలు విషం అవసరం పడుతుంది. అందుచేత అక్కడ ప్రత్యేకంగా కొన్ని ఫామ్ హౌస్ లు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆ ఫామ్ హౌస్‌లలో తేళ్ళను పెంచి వాటి నుంచి విషాన్ని సేకరిస్తూ ఉంటారు. నిజానికి ఇది చాలా ప్రమాదకరం అయినప్పటికీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఒక్కో ఫామ్ హౌస్ లో వందల సంఖ్యలో తేళ్ళ ను ఉంచుతారు. వాటికి రోజు ఆహారం పెడుతూ విషం పెంచుకునేలా చేస్తారు. తర్వాత ఆ విషాన్ని సేకరించి గడ్డకట్టేలా చేసి దాని నుంచి పౌడర్ రూపంలో మార్చుకుంటారు. ప్రస్తుత మార్కెట్లో ఒక లీటర్ తేలు విషం ధర 80 కోట్ల రూపాయలు దాకా పలుకుతుందని టర్కీ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అందుచేత టర్కీలో ఇటువంటి తేళ్లకు సంబంధించిన ఫామ్ హౌస్ లకు గిరాకీ పెరుగుతోంది.