బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ సహా హిందూ సమాజంపై హింసను ప్రేరేపించినందుకు శిబ్లీ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడైన అబ్దుర్ రెహ్మాన్ శనివారం రాత్రి తన కళాశాల గేట్ వెలుపల వివాదాస్పద ప్రసంగం చేశాడు.
“నూపుర్ శర్మ దైవదూషణకు పాల్పడింది, మన ప్రవక్తను అవమానించింది. ‘786’ అనే పవిత్ర సంఖ్యను లేదా హత్యాకాండకు సంబంధించిన చిత్రాన్ని పోస్ట్ చేసినా వారి చేతులు నరికివేసేలా ఉన్నారు ముస్లింలు. కానీ మన ప్రవక్త గౌరవానికి భంగం వాటిల్లినప్పుడు, ఏ ముస్లిం కూడా ముందుకు రాడు (పగ తీర్చుకోవడానికి). ఎందుకు? ఎందుకంటే మనం భయపడి.. పిరికివాళ్లం అయ్యాం ”అని అతడు ఒక ముస్లిం సమావేషంలో అందర్నీ ప్రేరేపించాడు.
https://twitter.com/IamShaikhAdil/status/1530911827835637760?s=20&t=X2AMC4xi8qIuygx5TdMd-g
“అందుకే మన విశ్వాసం కోసం నిలబడవలసిందిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా”అని అన్నాడు. నారా-ఎ-తక్బీర్, అల్లాహు అక్బర్ నినాదాల మధ్య, అబ్దుర్ రెహ్మాన్ 80 కోట్ల మంది ప్రజలను (హిందూ సమాజాన్ని) తన పాదాల క్రింద తొక్కడానికి సిద్ధంగా ఉన్నానని హెచ్చరించాడు. బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ రక్తం కోసం ముస్లింలు పోటీ పడుతున్నారు. “గుస్తాక్-ఎ-రసూల్ కి ఏక్ హి సాజా, సర్ తన్ సీ జుదా (ముహమ్మద్ ప్రవక్తను అపహాస్యం చేసినందుకు ఏకైక శిక్ష శిరచ్ఛేదం)అని షిబ్లీ కాలేజీ ప్రెసిడెంట్ ప్రసంగిస్తున్న సమావేశంలోని జనంలో ఒక వ్యక్తి ప్రకటించాడు.
వివాదాస్పద వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అజంగఢ్ సైబర్ సెల్ ఈ విషయాన్ని గుర్తించి దర్యాప్తు ప్రారంభించింది. అజంగఢ్ ఎస్పీ అనురా ఆర్య తెలిపిన వివరాల ప్రకారం, రెహమాన్‌ను అదుపులోకి తీసుకుని విచారణకు జరుపుతున్నారు. ఇండియన్ పీనల్ కోడ్(IPC) సెక్షన్ 295A ప్రకారం ఉద్దేశపూర్వకంగా మతపరమైన భావాలను కించపరిచినందుకు నిందితుడిపై FIR నమోదు చేశారు.