7 వ శతాబ్దికి చెందిన కవి జ్ఞాన సంబంధర్ తమిళంలో రాసిన తేవరం శ్లోకాలున్న తామ్రఫలకాలు బయటపడ్డాయి. తమిళనాడులోని సిర్కాళి శ్రీ బ్రహ్మపురీశ్వరర్-సత్తైనాధర్ ఆలయంలో తవ్వకాల్లో వీటిని గుర్తించారు. తామ్రపత్రాలు మాత్రమే కాదు 23 పంచలోహ విగ్రహాలు, 50 పీఠాలు, శాసనాలు అందులో ఉన్నాయి. తేవరం తిరుపతిగమ శ్లోకాలు లిఖించిన 493 తామ్రపత్రాలను కనుగొన్నారు. ఆ రాగి ఫలకాలు వెయ్యేళ్లనాటి చోళరాజుల కాలం నాటివని చెబుతున్నారు. ఇక శివుడు, విష్ణువు, కార్తికేయుడు, గణపతి, నంది,నెమలి తదితర పంచలోహ విగ్రహాలున్నాయి. ఆలయ ప్రాంగణంలో బయటపడిన వాటిని చూసేందుకు పెద్దఎత్తున జనం తరలివస్తున్నారు.అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని భద్రత కల్పించారు.
https://twitter.com/tweet_nsc/status/1648152441576378368?s=20