ఇప్పటి వరకు వ్యాపారంలో లాభాలు సంపాందించిన అదానీ ఇప్పుడు సేవా మార్గం బాట పట్టారు. తన తండ్రి శతజయంతి, అలాగే తన 60వ పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం వెల్లడించారు. అదానీ గ్రూపు ద్వారా రాబోయే రోజుల్లో 60 వేల కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు చేయబోతున్నట్టు స్వయంగా ట్విటర్ ద్వారా ప్రకటించారు.
ఈ విరాళాన్ని అదానీ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. ఆరోగ్య సంరక్షణ, విద్య సహా నైపుణ్యాభివృద్ధికి కార్యకలాపాలకు సంబంధించిన కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నారు. “స్పూర్తిదాయకమైన మా నాన్నగారి 100వ జయంతితో పాటు, ఈ సంవత్సరం నా 60వ జన్మదిన సంవత్సరం కారణంగా అదానీ కుటుంబం ఆరోగ్య సంరక్షణ, విద్య సహా నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన స్వచ్ఛంద కార్యక్రమాలకు రూ. 60,000 కోట్లు అందించాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సేవలో పాలుపంచుకుంటాం” అని అదానీ ట్వీట్ చేశారు.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అదానీ ప్రస్తుత నికర విలువ $91.7 బిలియన్లుగా ఉంది
https://twitter.com/gautam_adani/status/1539947148199964673?s=20&t=fKI4IPVsVQasBzYglDPUAg