టోక్యోలో గ్రాండ్ గా పారాలింపిక్స్ -భారత్ నుంచి 54మంది క్రీడాకారులు 16వ పారాలింపిక్స్‌కు టోక్యోలో గ్రాండ్ గా మొదలయ్యాయి. వైకల్యం శరీరానికే కాని.. తమ సంకల్పానికి కాదంటూ పలు దేశాలకు చెందిన 4500 మంది పారా అథ్లెట్లు క్రీడోత్సవాలకు సిద్ధమయ్యారు. భారత్ నుంచి 54 మంది పాల్గొంటున్నారు. ఆశించిన రీతిలో పతకాలే లక్ష్యంగా భారత క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు.
ఇప్పటి వరకు పారాలింపిక్స్ భారత్ 12 పతకాలు సాధించింది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువే గెలుచుకోవాలని టీం ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.
గతంలో స్వర్ణాలు సాధించిన దేవేంద్ర జజారియా, మరియప్పన్ తంగవేలు సహాస్టార్ అథ్లెట్లు బరిలోకి ఉన్నారు.
ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు 13 రోజుల పాటు జరిగే పారా విశ్వక్రీడల్లో 163 దేశాలకు చెందిన సుమారు 4500 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. 22 క్రీడలకు సంబంధించి 540 ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తారు. ఐదుగురు అథ్లెట్లు, ఆరు మంది అధికారులు మొత్తం 11 మందితో కూడిన భారత జట్టు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొంది.