నగర శుభ్రతపై మరింత దృష్టిపెట్టిన బనారస్ మున్సిపాలిటీ అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి ఎవరైనా రోడ్డుపై చెత్తను వేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉదయాన్నే చెత్తను సేకరించేందుకు వచ్చే వాహనంలో మాత్రమే చెత్తవేయాలని… రోడ్డుమీద పడేయద్దని ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా.. ఎవరైన ఉదయం 8 తర్వాత లేదా చెత్తను రోడ్ల మీద వేస్తూ కనిపిస్తే… 5వందల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు అందుకు నిఘాకోసం కొందరిని ప్రత్యేకంగా నియమించారు కూడా. ఇటీవలి దేశవ్యాప్త స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో వారణాసి 21వ స్థానంలో నిలిచింది. 2021లో బనారస్ ర్యాంకింగ్ 30వ స్థానంలో ఉంది. మునిసిపల్ కార్పొరేషన్ ర్యాంకింగ్‌ను మెరుగుపరచడంతో పాటు బనారస్ నగరాన్ని మునుపటి కంటే క్లీన్ సిటీ గా మార్చేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.