ఈ కాలం యువత కు ఫారిన్ మోజు అంతకంతకూ పెరిగిపోతోంది. కొత్త సంవత్సరం వేడుకల్లో మందు పార్టీలు తప్పనిసరి అయిపోతున్నాయి. మందు తాగని వాడు మగాడే కాదు అన్న రేంజ్ లో బ్రాండింగ్ అయిపోతోంది. అందుచేతనే మద్యం అమ్మకాల్లో రికార్డులు తిరగరాసేస్తున్నారు. ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకల్లో కూడా మద్యం అమ్మకాలు పోటెత్తిపోయాయి. ఒక్క డిసెంబర్ లోనే 4వేల కోట్ల రూపాయల మేర మద్యం కొనుక్కొని ఫుల్లుగా తాగేశారు. రికార్డులను తామే తిరగరాస్తూ ముందుకు దూసుకొని పోతున్నారు.
….
ఇక, కొత్త సంవత్సర వేడుకలు హైదరాబాద్ లో ఒక రేంజ్ లో జరిగాయి. కొత్త సంవత్సరం రోజున కచ్చితంగా మద్యం తాగాలని మందుబాబులు ఒట్టేసుకొని మరీ తాగేశారు. దీంతో డిసెంబర్ నెలాఖరున నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.926 కోట్ల విలువైన మద్యం తాగేశారు. డిసెంబర్ 28 నుంచి 31 దాకా మద్యం అమ్మకాలు జోరెత్తిపోయాయి. ఈ నెల చివరి రోజుల్లో 31న రూ.282 కోట్లు, 30న రూ.402 కోట్లు, 29న రూ.51 కోట్లు, 28న రూ.191 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. నూతన సంవత్సరం వేడుకల పేరిట అర్ధరాత్రిదాకా మద్యం దుకాణాలకు అనుమతులిచ్చి మందుబాబుల నుంచి భారీగా ఆర్జించినట్టు తేలింది.
….
ఇక, కొత్త సంవత్సర వేడుకల కోసం ప్రత్యేక అనుమతులు కూడా బాగా మంజూరు అయ్యాయి. ఫంక్షన్ హాల్స్, పబ్ లు, బార్ల లో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. ఈ అనుమతుల ద్వారా ప్రభుత్వానికి అర కోటి దాకా ఆదాయం సమకూరింది. ఈ నెల 31న మొత్తం 287 ఈవెంట్లకు అనుమతులు ఇచ్చారు. వీటి ద్వారా 56.46 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. దీంతో కొత్త సంవత్సర వేడుకలు కూడా ఫుల్ రేంజ్ లో జరిగిపోయాయి.
..
హైదరాబాద్ లనే కాదు, ఇతర ప్రాంతాల్లోని యువత కూడా అదే బాటలో నడుస్తున్నారు. తాగేద్దాం, ఊగేద్దాం అని ఉరకలు వేస్తున్నారు. ఇటీవల అమ్మాయిలు కూడా ఆ బాటలోకి వెళ్లటం మరో విషాదం. దీని మీద యువతే స్వచ్చందంగా ఆలోచించుకోవాలి.