స్టాలిన్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా మేయర్ పీఠంపై కూర్చున్నారు 29 ఏళ్ల ప్రియ. తమిళనాడులో మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే దాదాపు క్లీన్ స్వీప్ చేసిందని చెప్పవచ్చు. ఇక చెన్నైలో 200 వార్డుల్లో 153 వార్డులను ఆ పార్టీ కైవసం చేసుకోగా…మరో 25స్థానాలు మిత్రపక్షాల వశమయ్యాయి. దీంతో 28 ఏళ్ల ప్రియను మేయర్ గా ఎంపిక చేసింది పార్టీ. చెన్నై మేయర్ పీఠాన్నిఅధిష్టించిన తొలి దళితమహిళ కూడా ప్రియనే. గతంలో చెన్నైకి 48 మంది మేయర్లు పనిచేయగా వారిలో ఇద్దరు మాత్రమే మహిళలు. మూడోమహిళగానూ, దళితమహిళగానూ, అత్యంత పిన్న వయస్కురాలిగానూ ఇప్పుడు ప్రియ రికార్డ్ సృష్టించారు. ప్రస్తుత సీఎం స్టాలిన్ గతంలో చెన్నై మేయర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వయసులోనే డీఎంకేలో చేరిన ప్రియ పార్టీలో చురుగ్గా పాల్గొంటుండేది. పీజీ చేసిన ప్రియకు స్థానిక సమస్యలపై మంచి పట్టుఉండడంతో ఆమెకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చారు స్టాలిన్. గెలిచాక ఏకంగా మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు.

Chennai Mayor Priya Rajan