41 రోజుల మండలపూజ ముగింపు వేడుక శబరిమల ఆలయంలో ఘనంగా జరిగింది. ప్రధానపూజారి కందరారు రాజీవర్ నేతృత్వంలో అయ్యప్పస్వామికి బంగారు వస్త్రాన్ని ధరింపచేశారు.అనంతరం కలశాభిషేకం ఇతర పూజలు నిర్వహించారు. శబరిమల దేవస్వోం బోర్డు అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాన్ని భక్తితో తిలకించారు.అనంతరం ఆలయ ద్వారాలు మూసివేశారు. ఈ 41 రోజుల్లో 30లక్షలమందికిపైగా భక్తులు స్వామిదర్శనం చేసుకున్నారని కేరళ దేవాదయమంత్రి రాధాకృష్ణన్ తెలిపారు. దాదాపు 223 కోట్ల ఆదాయం ఆలయానికి సమకూరిందని ఆలయ బోర్డ్ ప్రకటించింది. ఇక ఈనెల 30 ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. నాటినుంచి మకరజ్యోతి దర్శనం వరకు పెద్దఎత్తున అయ్యప్పభక్తులు శబరిగిరులపైనున్న అయ్యప్ప దర్శనానికి వస్తారు. జనవరి 14న మకరవిలక్కు పూజలుంటాయి. జనవరి 20న ఆలయద్వారాల మూసివేతతో అయ్యప్ప వార్షికయాత్రా సీజన్ ముగుస్తుంది.