2023-24 సంవత్సరానికి గానూ కేంద్రబడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్. దాదాపు గంటన్నరపాటు ఆమె బడ్దెట్ ప్రసంగం కొనసాగింది. వేతన జీవులకు ఊరటనిస్తూ…చివర్లో ప్రకటన చేశారు. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఆదాయప పన్ను మినహాయింపును 7 లక్షలకు పెంచారు. ఇంతకుముందు అది 5 లక్షలుగా ఉండేది. ఇక బడ్జెట్ ప్రభావంతో దేశీ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రెండయ్యాయి. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే సెన్సెక్స్ 1000 పాయింట్ల లాభాలతో దూసుకెళ్లింది. అలాగే నిఫ్టీ 250 పాయింట్లకు వెళ్లింది.
https://twitter.com/ANI/status/1620678098697216000?s=20&t=YktjPprzljaKukxKIuhXxQ