17 ఏళ్ల యువకుడు తన 13 ఏళ్ల చెల్లెలిపై గత రెండేళ్లుగా పలు సందర్భాల్లో అత్యాచారం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లిలో జరిగింది.
బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించామని.. బాలికను వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ తీసుకెళ్లారని బాచుపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె నర్సింహారెడ్డి తెలిపారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని అన్నారు.
బాలుడు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడని, అతని సోదరి 9వ తరగతి విద్యార్థిని అని పోలీసులు తెలిపారు. వారి తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్నారు.
బాలిక అనారోగ్యం కారణంగా మే 10న గచ్చిబౌలిలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడి వైద్యులు తనకు 18 వారాల గర్భిణిగా గుర్తించారు.
తన అన్నకు భయపడి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని బాధితురాలు తెలిపింది. అయితే తన సోదరుడు తనపై పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె తన తల్లికి వివరించింది. దీంతో బాధితురాలి తల్లి గర్భం తీయించేందుకు తూర్పు మారేడుపల్లిలోని ఓ ప్రైవేట్ మెటర్నిటీ క్లినిక్ కు తీసుకెళ్లింది. డాక్టర్ అబార్షన్‌కు నిరాకరించడం తోపాటు తల్లిని చైల్డ్‌లైన్‌ను ఆశ్రయించమన్నారు. బాలికను నగరంలోని భరోసా సెంటర్‌కు తరలించి కౌన్సెలింగ్ అనంతరం బాలిక తోపాటు తల్లిదండ్రులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచారు.
మే 17న మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కౌన్సెలర్ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక సోదరుడు గత రెండేళ్లుగా తనపై పలు సందర్భాల్లో అత్యాచారం చేశాడని, ఆమె 18 వారాల గర్భవతి అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో యువకుడు తన సోదరిని ప్రలోభపెట్టి బలవంతంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాలుడిపై IPC సెక్షన్లు 376(2)(i),(n) సహా POCSO చట్టంలోని సెక్షన్ 6 కింద కేసు నమోదు చేసి పట్టుకున్నారు.