ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నోనీ జిల్లా తులుం రైల్వే స్టేషన్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారని డీజీపీ పీ డౌంగెల్ తెలిపారు. మృతుల్లో ఏడుగురు జవాన్లు ఉన్నారు. మరో 60 మంది దాకా చుక్కుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 23 మందిని కొండచరియల కింద నుంచి బయటకు తీయగా 14 మంది మరణించినట్లు వెల్లడించారు. 107 టెరిటోరియల్ ఆర్మీ క్యాంపుపై కొండచరియలు పడటంతో జవాన్లు మృతి చెందారు. స్థానిక పోలీసులు, అస్సాం రైఫిల్స్ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు.
https://twitter.com/ANI/status/1542654933979496448?s=20&t=NTzhCVAwv7nMUg8TotHuoA
ఈ ఘటనపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, అక్కడి ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మణిపూర్‌కు అవసరమైన సహాయం అందించేందుకు కేంద్రం సిద్దంగా ఉందని తెలిపారు.