ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు..మిగిలిన ఆ ఒక్కరు బిపిన్ రావతేనని తెలుస్తోంది. తీవ్రంగా కాలినగాయాలతో ఉన్న ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన తరువాత ఆయన్ని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో బతికిన ఆ ఒక్కరూ రావతేనని…ఆయన ప్రాణాలతో తిరిగిరావాలని యావద్దేశం కోరుకుంటోంది. ప్రముఖులూ ఆయన ప్రాణాలతో రావాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.
ప్రమాదంలో హెలికాఫ్టర్ పూర్తిగా కాలి బూడిదైపోయింది. 11 మంది స్పాట్లోనే సజీవ దహనం అయిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కేవలం ముగ్గురిని మాత్రమే సైన్యం, పోలీసులు, రెస్క్యూటీం బయటకు తీశాయి. తెలియాల్సి ఉంది.
అటు ప్రమాద స్థలంలో మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. DNA పరీక్షల ఆధారంగా మృతదేహాల్ని గుర్తించనున్నారు. బ్లాక్ బాక్స్ కోసం గాలిస్తున్నారు.