హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు భగ్గుమంటున్న విషయం తెలిసినదే. ముఖ్యంగా బెంగళూరు హైవే ముంబై హైవే ని ఆనుకొని ఉన్న ప్రాంతాలలో భూములకు విపరీతంగా డిమాండ్ ఉంది. ఇదే ప్రాంతంలోని జహీరాబాద్ ప్రాంతంలో రైతుల మీద వక్ఫ్ బోర్డు పిడుగు వేసింది. తరతరాలుగా సేద్యం చేసుకున్న సుమారు 12 వేల ఎకరాల భూమి మాది అంటూ పక్ష బోర్డు క్లీన్ చేస్తోంది. దీంతో వేలాది రైతు కుటుంబాలు ఆర్తనాదాలు చేస్తున్నారు.
ఈ సంఘటన అంతా చిత్ర విచిత్రంగా జరిగిపోయింది. జహీరాబాద్ మండలం సత్వార్ కి చెందిన దేశ్ ముఖ్ అనే రైతు కుటుంబానికి సంబంధించిన భూముల్లో చోటుచేసుకుంది. ఆ కుటుంబానికి సత్వార్ గ్రామంలో 429, 430, 471 సర్వే నెంబర్లలో కొంత ఎకరాల భూమి వుంది. దేశ్ ముఖ్ మరణించడంతో ఆ భూమిని ముగ్గురు కుమారుల పైకి మార్చారు. కొంతకాలం క్రితం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొత్త పాస్ పుస్తకాలు వారికి ఇవ్వలేదు. పైగా మీ భూమి వక్ఫ్ పరిధిలో వుందని అధికారులు ప్రకటించారు.
దీంతో రైతుల గుండెల్లో రాయి పడింది. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమిపై హక్కులు తమవి కావని, వక్ఫ్ బోర్డుదని చెప్పడంతో రైతులు హతాశులయ్యారు. అప్పుడు రెవెన్యూ రికార్డులు బయటకు తీస్తే అనేక గ్రామాల్లోని రైతుల చాప కిందకు నీరు వచ్చేసింది.
ఇది అక్కడ వేల మంది రైతుల సమస్య. దీంతో ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. జహీరాబాద్ డివిజన్ లోని 2,500 మంది రైతులు ఇప్పుడు వక్ఫ్ బోర్డు ప్రకటనతో ఇరుక్కుపోయారు.
ఊళ్ళకు ఊళ్ళనే తమ ఖాతాలో వక్ఫ్ బోర్డు చూపించేసుకుంది.
నిషేధిత జాబితాలో మోగుడంపల్లి మండలి లో 2,971 ఎకరాలు, కోహీర్ మండలంలో 8,141 ఎకరాలు, జరాసంగం మండలంలో 325 ఎకరాలు, న్యాల్కల్ మండలంలో 365 ఎకరాలు, రాయికోడ్ మండలంలో 1,090 ఎకరాలు ఇలా మొత్తం 12,892 ఎకరాలను చేర్చారు.
వక్ఫ్ చట్టాన్నిఆసరగా చేసుకొనే, ఇలాంటి పనులకు ఒడిగడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 12 వేల ఎకరాల భూములు తమవేనంటూ వక్ఫ్ పేర్కొనడం చూస్తుంటే కావాలనే ఇలా కుట్రలు పన్నుతున్నారన్న విషయం అర్థమైపోతుంది. అంతేకాకుండా తమవే భూములంటూ ఒక గెజిట్ కూడా విడుదల చేసింది. కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను గద్దల్లా ఎగరేసుకుపోవడానికి కుట్రలు పన్నుతున్నారని స్థానికులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు.
హైదరాబాదు చుట్టుపక్కల భూముల రేట్లు బాగా పెరుగుతుండడంతో ఇటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. తరతరాలుగా సేద్యం చేసుకుంటున్న భూములు లాగేసుకోవడం మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.