అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కొలరాడోలోని బౌల్డర్ సిటిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ సూపర్ మార్కెట్లోకి ప్రవేశించిన సాయుధుడు విచక్షణా రహితంగా కాల్పులకు దిగాడు. దీంతో అక్కడే ఉన్న ఓ పోలీస్ అధికారితో పాటు.. మరొ 9 మంది ప్రాణాలు విడిచారు. అమెరికా స్థానిక కాలమాన ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సంఘటన జరిగింది. తొలుత వినియోగదారులపై కాల్పులు దిగిన దుండగుడిని గమనించిన పోలీసు అధికారి.. ప్రతిఘటించేందుకు యత్నించారు. దీంతో దుండుగుడు సదరు పోలీస్ అధికారిపై కూడా కాల్పులు జరపడంతో స్పాట్లోనే అధికారి మృతిచెందారు. మరణించిన ఆ పోలీస్ అధికారిని ఎరిక్ టాల్లీగా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు తీవ్ర గాయాలపాలవ్వడంతో అతడిని ఆస్పత్రిలో చేర్చారు.
#UPDATE | United States: Police say 'multiple' people including a police officer have lost their lives in the shooting at a supermarket in Boulder, Colorado.
"A suspect is in custody. He was injured and is being treated for his injury at a hospital," an officer says. https://t.co/Mq6syeLoSA pic.twitter.com/d5xHi6SDdX
— ANI (@ANI) March 23, 2021