ఈసారి ఆస్కార్ పురస్కారంకోసం నామినేషన్స్ బరిలో నిలిచిన సినిమాల జాబితాను ప్రకటించింది ఆస్కార్స్. భారత్ నుంచి 10 నిమిషాలు బరిలో ఉన్నాయి. ది చల్లో షో, ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్, కాంతార, విక్రాంత్ రోణా, గంగూభాయ్, మి వసంతరావ్, తుజ్యా సాథీ కహీహై, రాకెట్రీ, ఇరవిన్ నిళల్ సినిమాలు నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 301 సినిమాలు ఈ సారి ఆస్కార్ కోసం పోటీపడుతున్నాయి.మార్చి 12న ఆస్కార్ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంచలన సృష్టించిన కాంతారా సినిమా రెండు విభాగాల్లో నామినేషన్లకు అర్హత సాధించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమనటుడు విభాగాల్లో అర్హత సాధించినందుకు గర్వంగా ఉందని రిషబ్ షెట్టి హర్షం వ్యక్తం చేశారు. మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు రిషబ్.