మహిళలకు ఆస్తి హక్కుపై కీలకతీర్పునిచ్చింది సుప్రీం ధర్మాసనం. వీలునామా రాయకుండా తండ్రి మరణిస్తే..ఆయన స్వార్జితం పైనా, పితార్జితంగా వచ్చిన ఆస్తులపైనా కుమార్తెలకు హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. తండ్రి ఆస్తులపై అతని సోదరుడి మగపిల్లలకు కాక సొంత కుమార్తెలకే తొలి హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.
మద్రాస్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఓ వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే అతని ఆస్తులపై సొంత కుమార్తెలకు హక్కు ఉంటుందా…లేక సోదరుని కుమారులకు హక్కు ఉంటుందా అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ తీర్పును ఇచ్చింది న్యాయస్థానం.
ఒకవేళ ఓ హిందూ మహిళ వీలునామా రాయకుండా చనిపోతే ఆమెకు తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిపై తండ్రి వారసులందరికీ సమాన హక్కు ఉటుందని… అదే మహిళలకు భర్త, అత్తమామాల ద్వారా వచ్చిన ఆస్తులపై వీలునామా రాయకుంటే భర్త వారసులకు హక్కులు లభిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. మద్రాసు హైకోర్టు తీర్పుపై అప్పీల్పై వచ్చిన ఈ తీర్పు హిందూ వారసత్వ చట్టం ప్రకారం హిందూ మహిళలు, వితంతువుల ఆస్తి హక్కులకు సంబంధించినది.