మరాఠాలకు మహాసర్కారు కల్పించిన రిజర్వేషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. మరాఠా సంఘం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. 50శాతం రిజర్వేషన్ పరిమితిని అధిగమించడమేనది ధర్మాసనం అంది. 2018లో ఉద్యోగనియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో 16శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీన్ని వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విచారణ జరిపిన కోర్టు సమర్థిస్తూ 2019లో తీర్పు వెలువరించింది. అయితే కోటాను విద్యాసంస్థల ప్రవేశానికి 16 శాతం నుంచి 12 శాతానికి, ఉద్యోగ నియామకాల్లో 13శాతానికి తగ్గించాలని ఆదేశించింది. మళ్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం ధర్మాసనంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈకేసును విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు తుదితీర్పు వెలువరించింది.
రిజర్వేషన్లు చట్ట విరుద్ధమమని స్పష్టం చేస్తూ రద్దు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించితే సమానత్వపు హక్కును ఉల్లంఘించినట్టేనని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది. 50 శాతం మించకూడదనే 1992 నాటి తీర్పును మరోసారి సమీక్షించలేమని కూడా కోర్టు అభిప్రాయపడింది.