బెంగాల్ హింసాంకాండపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ జగ్దీప్ ధన్కర్కు మంగళవారం మోదీ ఫోన్ చేసి, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్రంలో లూటీలు, హత్యలపై ప్రధాని మోదీ తీవ్రంగా కలత చెందారని, ఆందోళన వ్యక్తం చేశారని గవర్నర్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు.
అటు బెంగాల్లో ఫలితాలు వెలువడిన తరువాత పశ్చిమ బెంగాల్లో హింసాకాండను తృణముూల్ కార్యకర్తలే మొదలు పెట్టారని బీజేపీ ఆరోపించింది. కారకులపై చర్యలు తీసుకోవాలని, సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో బీజేపీ నేత గౌరవ్ భాటియా పిటిషన్ దాఖలు చేశారు.
టీఎంసీని నాజీలతో పోల్చిన రాష్ట్ర పార్టీ…. పశ్చిమ బెంగాల్లో ఉన్నది ఫాసిస్టు ప్రభుత్వమని మండిపడింది.