##ఆలోచనా మథనం##
నూతన వ్యవసాయ చట్టం పై జరుగుతున్న ప్రచారాల లో….
నిజాలేవి…
అబద్ధాలే వి…
కమ్యూనిస్టు మిత్రులారా!!
కాంగ్రెస్ పక్ష నాయకుల్లారా!!!
ప్రాంతీయ పక్షాల సోదరులారా!!
నిజాలు మాట్లాడుకుందాం…
వాస్తవాలు చర్చకు పెడదాం!!
కనీసం..ఇప్పటికైనా
అబద్దాల ప్రచారం మానండి ….
భారత్ బంద్ తో మీరు సాధించింది ఏమిటి??
మీకు నచ్చని భావజాలంలో వున్న కార్యకర్తల షాపులు ద్వంసం..
మీలో మీరు గుద్దులాట లు తన్నులాటలు …
ఇంతే తప్ప మరింకేమైనా ఉందా??
నిజంగా మీది రైతుల క్షేమాన్ని కాంక్షించే ఉద్యమమే అయితే…
ఈ ఉద్యమంలో రాజకీయ రంగుల జెండాలు ఎజెండాలు ఎందుకు??
మీరు మీ చెప్పుచేతల్లో ఉండే రైతు సంఘాల నాయకులు చేస్తున్న రైతు వ్యతిరేక ఉద్యమం లో…..
గుండెల పై చెయ్యి వేసుకుని…..
నిజం చెప్పండి..
మీదృష్టి లో రైతులంటే..
పంజాబ్ హర్యానాలోని రైతు దళారీల??
అయినా సరే మీ కోణంలో వారే అసలు రైతులని కొంతసేపు అనుకుందాం మీ తృప్తి కోసం
అంటే దేశం మొత్తం పై రైతు లు పంజాబ్ హర్యానాలలోనే వున్నారా??
మిగితా ఉత్తరాది రాష్ట్రాలలో కానీ..
దక్షణాది రాష్ట్రాలు లో రైతులు లేరా??
కనీసం మీ భావజాలం లో వున్న రైతులు అయినా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారా?
పాల్గుంటే ఎంతమంది పాల్గొంటున్నారు??
వివరాలు ప్రజల ముందు చెప్పగలరా??
రైతు సంఘాల ముసుగులో మీరు కాంగ్రెస్ వారు కలిసి నియమించిన మీ చేతి కీలు బొమ్మలైన నాయకులు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు??
సాధారణ రైతులు తో ఎందుకు మాట్లా డించరు ??
మాట్లాడి స్తే మీ నిజస్వరూపం బయట పడుతుంది
అంతేగా?
కేంద్రప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల పక్షపాతి
రైతుల క్షేమం అసలు పట్టంచుకో దు….
నూతన వ్యవసాయ చట్టం లో…కార్పోరేట్లకే లాభం
అంటూ…
ఇంకా ఇ లా మీరు ఎంత కాలం అబద్ధాలు చెపుతారు…??
సరే ….
మీరు చెప్పిన విషయాన్ని మరో కోణంలో చెప్పమం టా రా?
మనిషి దేహంలో నోరు కనులు ముక్కు చెవులు కార్పొరేట్ కంపెనీలు అనుకోండి..
కాళ్ళు చేతులు రైతులు అనుకోండి…..
మిగితా దేహం సమాజం అనుకోండి…మీరు మీ మీ రాజకీయ ప్రయోజాలకోసం…..
వర్గ ప్రయోజనాల కొరకు
ఒక వర్గా నికి మాత్రమే మద్దతు ఇవ్వచ్చు ….
మీరు……
కాళ్ళు చేతులు ముఖ్యం అనుకోవచ్చు….
సమాజం లోని ముఖంలోని కనులు ముక్కులు చెవులు ముఖ్యం కాకపోవచ్చు…
కానీ ప్రభుత్వము సమాజంలో అన్నివర్గాల వారి హితం కోరుకోవాలి ….
రైతు పచ్చగా వుండాలి..
శ్రామికులు చల్లగావుండాలి..
పారిశ్రామిక వేత్తలు ఆర్థికంగా పరిపుష్తిగా ఉండాలి.
అయినా మీ రైతు సంఘాలు … రైతులకు ఉపయోగపడే అంశాలను మాత్రం కేంద్ర ప్రభుత్వ పెద్దల ముందు ఉంచ టలేదు….
ఎందుకంటారు??
ఇంతకీ మీరు భారత హోమ్ మంత్రి సమక్షంలో మీ రైతు నాయకులుంచిన డిమాండ్స్ ఏంటో తెలుసా??
అరెస్టు అయిన ప్రజాకవుల ను కార్యకర్తలను జైలు నుండి విడుదల చెయ్యాలి ట…
మరి ఆ ప్రజాకార్యకర్తలకు కవులకు రైతులకు వున్న బంధం ఎంటి??
ఇంతకు మీరు చేస్తున్న ఉద్యమం రైతుల కోసమా?? ప్రజా కవులు కార్యకర్తల కోసమా?
మీకు స్పష్టత లేకుండా పోవచ్చు…
కానీ రైతులకు ..ప్రజలకు స్పష్టత ఉంటుంది.
ఇంకా…
మీరు చేస్తున్న ఉద్యమంలో ఖలిస్తాన్ జిందాబాద్… పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు ఎందుకు చేస్తున్నారో సమాధానం ఇవ్వగలరా??
సరే ……
అసలు నూతన వ్యవసాయ చట్టం లో రైతులకు ఉపయోగ పడే అంశాలు ఏమున్నాయి?
రైతులకు నష్టం కలిగే విషయాలు ఏమున్నాయి?
వాటికి పరిష్కారాలు ఎంటి??
ఇవి కదా చర్చించాలి ….
ఇవి కదాఆలోచించాలి ??
నూతన వ్యవసాయ చట్టాలపై కనీసం అవగాహన లేకుండా ఎంత కాలం పిట్టల దొ రల్లా తుపాకీ రాముల్లు లా అబద్ధ ము లు ప్రచారం చేస్తారు
పక్కదారి పట్టించే పనికిమాలిన చర్చలు వలన సమాజం మేధావుల రైతుల ప్రజల పాత్రికేయుల విలువైన సమయం వ్యర్థం …
నూతన వ్యవసాయ చట్టాల పై నిజాయతీగా చర్చ చేద్దాం రండి
అంతే కానీ రైతుల లో లేని పోని ఊహాజనిత భయాలను కల్పించి ..
చలిమంట లు కాగుతూ మీ ప్రయోజనాలను నిరవెర్చుకోవాలనే ప్రయత్నాలు మానుకోండి!!
-చదలవాడ భరద్వాజ్