ఎన్నికలవేళ నాయకులు గ్రామాల్లోకి తరలిరావడం సహజం. కార్యకర్తలు, అభిమానులను వెంటబెట్టుకుని గుంపులు , గుంపులుగా ఊళ్ళ లోకి వచ్చి ఓట్లు అడుగుతుంటారు. పోటా పోటీగా హామీలను గుప్పిస్తూ ఉంటారు. ఆ తర్వాత హామీలను పక్కన పెట్టేసి పట్టణాలు నగరాలకు పరిమితమై వ్యాపారాలు , రాజకీయాలు చేసుకుంటారు. ఈ పోకడలతో విసిగిపోయిన నెమిల గ్రామ ఓటర్లు ఊరి ముందు పెద్ద బ్యానర్ పెట్టేసారు. ఇప్పుడు ఆ బ్యానర్ సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నది.
నెమిల గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట మండలానికి చెందిన చిన్న ఊరు. ఇక్కడ గ్రామస్తులు ఒకే మాట, ఒకే కట్టుబాటుతో ఉంటారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమాజ హితం కోరేవాళ్లే నాయకులు అని నమ్మి గ్రామస్తులు ఈ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఉచిత పథకాలు, కల్లబొల్లి కబుర్లు వద్దని తేల్చి చెప్పారు. దేశభక్తి కోసం సిఏఏ అమలు చేయాలని , సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని, అన్నదాతల ఆత్మహత్యలు లేని వ్యవసాయ విధానాలు కావాలని తేల్చి చెప్పారు. అటువంటి పనులు చేసేటట్లయితేనే తమ ఊరికి వచ్చి ఓట్లు అడగాలని, లేదంటే వెనక్కి వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు
మొత్తానికి నెమిల గ్రామ సోదరులు అందరికీ ఆదర్శంగా కదా..!