
దేశరాజధానిలో కరోనా ఉధృతంగా వ్యాపిస్తోంది. దీంతో లాక్ డౌన్ విధిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆరురోజులపాటు పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలవుతుందని ఆయన అన్నారు. నేటి రాత్రి 10 గంటలనుంచి మొదలయ్యే లాక్ డౌన్…సోమవారం  ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుంది. కరోనా కట్టడికి చర్యలు  చేపడుతున్నామన్న కేజ్రీ…ఆరురోజుల లాక్ డౌన్ సమయంలో ఆస్పత్రుల్లో బెడ్లు పెంచుతామన్నారు. విపత్కర సమయంలో సాయంగా కేంద్రానికి డిల్లీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు.  నిత్యావసరాలు, వైద్యం సహా ఇతర అత్యవసర సేవలు కొనసాగుతాయని ఆయన అన్నారు.
గత నాలుగురోజులుగా ఢిల్లీలో రోజుకు 25 వేల కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆస్పత్రుల్లో బెడ్లు, మందులకు తీవ్ర కొరత ఏర్పడింది.
                                                                    


