ఉయ్యాలవాడ సూర్య చంద్రులు

కాలగమన మను కడలి పొంగినా, కాయ మెప్పుడో మాయ మయ్యినా, కర్పూరములా కరగి పోయినా, ధర పై సూర్య ప్రభాత కరమ్ములు, శీతాంశుని ఆహ్లాద కిరణములు, ప్రసారితమ్మగు నంత కాలము , లోకమాన్యులౌ వీరుల శూరుల, యశోవిభవ సౌగంధ వీచికలు, మన దేశోన్నతి, మన అభ్యున్నతిని, దశదిశలా ప్రసరింప జేయగా కీర్తి పతాకము అనంత కాలము హిమాలయము పై రెపరెపలాడును.

అటువంటి మహానుభావులే, ప్రస్తుతపు కర్నూలు జిల్లా లోని, ఉయ్యాలవాడ అనే గ్రామంలో ఉదయించిన నరసింహారెడ్డి మరియు వెంగళరెడ్డి. ఒకరు యుద్ధ వీరు లయితే ఒకరు దాన శూరులు. ఇరువురూ ఒకే మారుమూల పల్లెలో జన్మించడము అతి గొప్ప విశేషము. వారి ఘనత గౌరవము విని గర్వపడాలంటే …….. వారి గురించి చెరుకు రామమోహనరావు గారు వారిని గూర్చి చేసిన వ్యాఖ్యానము వింటే మీకే తెలుస్తుంది ఒడలు గగుర్పొడుస్తుందా లేదా అని…..